Melodious singer sunitha Got devorced with her husband - Kiran offecially.., due to some personal resons.
తన గాన మాధుర్యంతో పాటు, ఆకట్టుకునే రూపంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసుకుంది ప్లే బ్యాక్ సింగర్ సునీత. ఆమె పాడిన పాటలు నచ్చని వారు తెలుగు గడ్డపై ఉండరంటే అతిశయోక్తి కాదేమో? మరి అంతటి గుర్తింపు తెచ్చుకుందామె. కోకిల లాంటి స్వరంతో పాటు మైమరిపించే రూపం...ఆమె ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.
ఆ విషయం పక్కన పెడితే...సునీత కాపుంలో గత కొంత కాలంగా కలతలు రేగాయని, తన భర్త కిరణ్ తో విడి పోవడానికి సిద్ధమైందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు కన్ ఫర్మ్ అయింది. సునీతకు 19 ఏళ్ల వయసులోనే కిరణ్ తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు.
సినీ ప్రపంచంలో ఉన్నప్పడు ఆరంగంలో ఉండే దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులతో సన్నిహితంగా మెలగడం తప్పనిసరి. ఈ విషయాన్ని అర్థం చేసుకోని సునీత భర్త కిరణ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడని, ఈ సాకుతో తరచూ వేధిస్తుండే వాడని, ఆ కారణంగానే సునీత తన కెరియర్, పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని విడాకులు తీసకుందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. సునీత వేరొకరితో ఎఫైర్ పెట్టుకుందనే మరో వెర్షన్ కూడా వినిపిస్తుండటం గమనార్హం.
-- Source ONEINDIA -- Not official to cineemaaworld
By Team SAKV&N ®
Singer sunitha - Divorce
Views:
0 comments:
Post a Comment